స్మార్ట్ ఫోన్స్ గురించి మన అందరి కోసం ఈ కధ
అరుదుగా కొనే వస్తువుల మీద అపురూపమైన ప్రేమ ఉంటుంది. దాన్ని వేరేవారు కావాలని అడిగిన, ముట్టుకున్నా కాస్తంత కోపం ముక్కు మీదే వస్తుంది... ఒక్కోసారి బంధాలను, అనుబంధాలను పక్కనపెట్టి మరీ ఆ వస్తువులనే చూస్తూ ఈ లోకాన్ని మర్చిపోయినవారు ఉన్నారు... కానీ ఈ యాంత్రిక జీవనంలో వస్తువులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు... బంధాలకు బంధం వేస్తున్నారు...
"రాత్రి భోజనాల తర్వాత ఒక టీచర్ ఆమె విద్యార్థులు వ్రాసిన వ్యాస రచనల పేపర్లును దిద్దడం మొదలుపెట్టింది. ఆమె పిల్లలు పడుకున్నారు, భర్త కుర్చీలో కూర్చుని స్మార్ట్ ఫోన్లో తన అభిమాన "క్యాండీ క్రష్ సాగా "ఆటలో లీనమై ఆశక్తి గా ఆడుతున్నాడు... చివరి పేపర్ దిద్దడానికి తీసి అందులో వ్రాసిన సమాధానాన్ని చదివిన ఆ టీచర్ నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపు వెక్కిళ్ల శబ్దానికి గేమ్ ఆడుతున్న ఆమె భర్త చూసి ఆశ్చర్యపోయాడు... ఓయ్ !ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? "చాలా రోజుల నుంచి నేను నిన్నేం అనట్లేదు కదా "అని అన్నాడు. అప్పుడు భార్య టెన్షన్ తో సమాధానం ఇస్తూ," నిన్న నా సెకండ్ క్లాస్ విద్యార్థులకు హోమ్ వర్క్ ఇచ్చాను. మీరు ఏం కావాలనుకుంటున్నారు అనే అంశం పైన ఏదైనా రాసుకురండీ "! అని చెప్పాను. తాను ఒక ప్రశ్న అడిగితే మరో సమాధానం ఇస్తున్న భార్యను విసుగ్గా చూస్తూ.. సరే కానీ నువ్వెందుకు ఏడుస్తున్నావ్? అంటూ గద్దించాడు. "ఇదిగో !ఈ చివరి పేపర్ దిద్దుదామని చదువుతుంటే ఏడుపు ఆపుకోవడం నా వల్ల కావట్లేదు. "అని చెప్పింది. భర్త ఆశక్తి గా... అంత ఏడిపించే విధంగా ఏం వ్రాసారు అందులో అని అడిగాడు. చదువుతాను వినండి అంది భార్య.
హెడ్డింగ్ ఈ విధంగా పెట్టాడు ఆ బాబు
నేను "స్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక "...
అమ్మానాన్నలు స్మార్ట్ ఫోన్ ని చాలా ప్రేమిస్తారు !వాళ్ళు స్మార్ట్ ఫోన్ ని చాలా శ్రద్ధగా, కేర్ గా,ఇష్టంగా చూసుకుంటారు. చాలా సార్లు నా కన్నా ఎక్కువగా కూడా... నాన్న ఆఫీసు నుంచి అలసటతో వచ్చినపుడు, అతనికి స్మార్ట్ ఫోన్ రిలాక్స్ ను ఇస్తుంది. నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం సమయం ఉంది,కానీ నా కోసం లేదు. ఎందుకంటే నాన్న కి నాతో ఆడుకోవడం రిలాక్స్ ను ఇవ్వడం లేదు. అమ్మానాన్నలు ముఖ్యమైన పనుల్లో ఉన్నపుడు కూడా స్మార్ట్ ఫోన్ రింగవుతుంటే, ఒకటి రెండు రింగులు వచ్చేలోపే వారు చేతిలోకి తీసుకొని జవాబిస్తారు. కానీ నేను ఎన్నిసార్లు పిలిచినా ఫోన్ కి ఇచ్చే ప్రిఫరెన్స్ నాకు ఇవ్వరు .
ఒక వేళ నేను అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటే కూడా... చివరికి అప్పుడు కూడా వాళ్ళు నాతో కాకుండా స్మార్ట్ ఫోన్ తోనే గడుపుతుంటారు. వాళ్ళు నాతో కన్నా స్మార్ట్ ఫోన్ తో ఆడుకోడానికే ఎక్కువ ఇష్టపడతారు. వాళ్ళు తమ స్మార్ట్ ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్నపుడు నేనేం చెప్పిన వినిపించుకోరు,అది నాకు మొఖ్యమైన విషయం అయినా సరే అది వాళ్లకు ముఖ్యం కాదు. అదే వాళ్ళు నాతో మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఫోన్ రింగ్ అయితే వెంటనే జవాబిస్తారు.
అమ్మానాన్నలు స్మార్ట్ ఫోన్ ని చాలా కేర్ గా చూసుకుంటారు. !ఎప్పుడు తమతోనే ఉంచుకుంటారు !
దానికి చాలా ప్రాధాన్యతనిస్తారు !
దాన్ని చాలా ఇష్టపడతారు !
దానితో రిలాక్స్ అవుతుంటారు !
దానికి తమ ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు !
దానితో ముచ్చట్లు పడుతుంటారు !
దానిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంటారు !
పడుకున్నప్పుడు కూడా దానిని పక్కలోనే ఉంచుకుంటారు!
ఉదయం లేవగానే దాన్నే చేతిలోకి తీసుకుంటారు !!
దానితో చాలా ఆనందంగా ఆడుకుంటారు !
కాబట్టి నా కోరిక ఏమిటంటే... నేను అమ్మానాన్నల చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ ని కావాలని కోరుకుంటున్నాను. !!
భార్య చదువుతుంటే శ్రద్ధగా వింటున్న భర్త కి కూడా మనసంతా పిండేసినట్టయింది . ఉద్వేగభరితుడయ్యాడు, కళ్ళు తడిబారాయి.
""ఎవరు వ్రాసారది ? ""అని భార్యను అడిగాడు. ఆమె బొంగురు గొంతుతో ""మన కొడుకు ""అని సమాధానమిచ్చింది కన్నీరు కార్చుతూ.
వస్తువులను ఉపయోగించుకోవాలి !
బంధాలను ప్రేమించాలి !!
అన్ని బంధాలకన్నా వస్తువులని ఎక్కువ గా ప్రేమించడం మొదలుపెడుతూ ఉంటే క్రమంగా అసలైన బంధాలు కనుమరుగై పోతాయి.