ఒక రాజు కథ


పూర్వం భానుచక్రవర్తిఅనే రాజు ఉండేవాడు. అతనికి ఒక కుమార్తె ఉంది. ఆమె అంటే రాజుకి చాలా ఇష్టం, రాజు చాలా దురాశపరుడు. కోశాగారం నిండా ధనం, వజ్ర వైడూర్యాలు ఉన్నపటికీ ఇంకా ఎక్కువ ధనం కూడబెట్టాలని ఆశపడేవాడు ఒక సారి తన కోశాగారంలో ధనం లెక్కిస్తుండగా ఒక దేవత ప్రత్యక్షమయ్యి ఓ రాజా!నీకు చాలా ధనం ఉంది కదా అని ప్రశ్నించింది.
అప్పుడు ఆరాజు నా దగ్గర ఉన్న ధనం పెద్ద ఎక్కువ కాదు నాకు ఇంకా ధనం కావాలని ఉంది అని చెప్పాడు. అప్పుడు ఆ దేవత అతనికి ఒక గుణపాఠం నేర్పాలనుకుంది.
భానుచక్రవర్తి ! నీకు ఒక వరం ఇస్తాను ఏం కావాలో కోరుకోమంది. అంతే అతని ఆనందానికి అవధులు లేవు ఏం కోరుకుంటే దేశంలోకెల్లా గొప్ప ధనవంతుడిని కాగలను అని ఆలోచించాడు. చివరికి నేను దేన్ని తాకితే అది బంగారం కావాలని కోరుకున్నాడు దేవత తధాస్తు అని, అయితే ఆ వరం రేపటి నుండి పనిచేస్తుంది అని చెప్పి అంతర్ధానం అయింది. ఆ రాత్రి రాజు కి నిద్ర లేదు ఎప్పుడు తెల్లరుతుందా అని ఎదురుచూసాడు. తెల్లవారగానే ఇంట్లో సంతోషంగా తిరుగుతూ కుర్చీలో కూర్చున్నాడు కుర్చీ బంగారం అయింది, మంచం మీద కూర్చున్నాడు బంగారం అయింది, తోటలో ఉన్న చెట్లను తాకాడు అవీ బంగారంల మారిపోయాయి ఇక రాజు ఆనందానికి హద్దేలేదు ప్రపంచంలో కెల్లా నేనే గొప్ప ధనవంతుడిని అనుకున్నాడు. కాసేపటికి బాగా దాహం వేసింది నీళ్ల చెంబు ముట్టుకున్నాడు నీళ్లు, చెంబు రెండూ బంగారం అయిపోయాయి. మరి కాసేపటికి ఆకలేసింది అన్నాన్ని తాకేసరికి అదీ బంగారం అయింది. తన ముద్దుల కుమార్తె వచ్చి వడిలో కూర్చుంది తను బంగారు బొమ్మల మారిపోయింది దానితో భానుచక్రవర్తి ఖంగు తిన్నాడు. కూతురు బొమ్మల మారటం బాధ కలిగించింది ఏం చేయాలో తోచలేదు. ధనం పై ఉన్న ఆశ ఆవిరైపోయింది ఇంత ధనం ఉన్న తినడానికి నోచుకోని జీవితం వృధా అనుకున్నాడు ఇష్టమైన కూతురు బొమ్మగా మారిందని నొచుకున్నాడు. వెంటనే దేవతని ప్రార్ధించాడు. ఆమె మళ్ళీ ప్రత్యక్షమై నీకు బంగారం కావాలా? అన్నం కావాలా? నీళ్లు కావాలా? అని వ్యంగ్యంగా అడిగింది. తన దురాశ వలనే ఈ పరిస్థితి వచ్చిందని గ్రహించాడు చక్రవర్తి. నాకు ధనం వద్దు, వరం వద్దు నాకున్నది చాలు వరం రద్దు చేయమని కోరాడు.రాజు తన తప్పుని తెలుసుకున్నాడని దేవత గ్రహించి వరం రద్దు చేసింది. రాజు వెళ్లి వాటిని తిరిగి తాకగానే మామూలుస్థితికి వచ్చాయి.అప్పటి నుంచి రాజు దురాశకు పోకుండా ఉన్నదానితో సంతోషంగా జీవించసాగాడు.
నీతి :దురాశ దుఃఖానికి చేటు