రూపాదేవికి ఓ చిక్కు సమస్య వచ్చింది.
చదువుకొనే రోజుల్లో నాలుగిళ్ల చావిడిలో ఒక వాటాలో తాము అద్దెకి ఉండేవారు.
ఒక వాటాలో తాయారమ్మ, ఆమె భర్త ఉండేవారు. పక్క పక్క వాటాలవడం
ఒకళ్ల ఇళ్లలోకి ఇంకొకరు యదేఛ్చ గా వచ్చేసేవారు.
ఒక వాటాలో తాయారమ్మ, ఆమె భర్త ఉండేవారు. పక్క పక్క వాటాలవడం
ఒకళ్ల ఇళ్లలోకి ఇంకొకరు యదేఛ్చ గా వచ్చేసేవారు.
తాయారమ్మకి కొంచెం చేతివాటం ఉంది. ఏ చిన్న అవకాశం జారవిడవదు.
చెంచా దగ్గర నించీ చంద్రహారాల దాకా ఏవీ వదలదు. ఈమె బుద్ధి పసికట్టి అందరూ ఆమెని దూరం ఉంచడం మొదలెట్టేరు.
చెంచా దగ్గర నించీ చంద్రహారాల దాకా ఏవీ వదలదు. ఈమె బుద్ధి పసికట్టి అందరూ ఆమెని దూరం ఉంచడం మొదలెట్టేరు.
అయినా వస్తువులు పోడం డబ్బు మాయం
అవడం ఆగలేదు. ఇంటి యజమానులకు
చెప్పినా ఫలితం లేదు. ఈ తాయారమ్మ వడ్డీ లేని అప్పులు ఇంటివారికి ఇచ్చి వాళ్ల నొరు
కట్టేసింది. పోనీ ఇల్లు ఖాళీ చేసేద్దామంటే రూప వాళ్ల తండ్రి ఆదాయం అంతంత పాటి. అద్దె లు ఎక్కువగా ఇచ్చే పరిస్థితి లేదు. భార్య కే జాగ్రత్తగా ఉండమని కోరేడతను.

కొన్నేళ్లకి రూప చదువు అయి ఉద్యోగం రాగానే, ఇల్లు ఖాళీ చేసి దూరంగా ఇల్లు తీసుకున్నారు . తాయరమ్మ పోరు తగ్గి హమ్మయ్యా అనుకున్నారు.
ఇప్పుడు తప్పనిసరిగా బాస్ గారి అబ్బాయి పెళ్లికి పక్కూరు వెళ్లింది.
అక్కడ తాయారమ్మ తయారు. ఆమె చాలా హడావిడిగా పెత్తనం చేస్తున్నాది.
అక్కడ తాయారమ్మ తయారు. ఆమె చాలా హడావిడిగా పెత్తనం చేస్తున్నాది.
తాయారమ్మకీ రూపాదేవికి ఒక గది ఇచ్చారు పెళ్లి వారు.
రూపాదేవి చాలా ఇరుకులో పడింది. పెళ్లికని తెచ్చుకున్న బంగారం నగలు పెట్డెలో ఉన్నాయి. ఇహ వాటి మీద ఆశ వదులుకోవలసిందేనా!
బాస్ తో ఈమె గురించి చెప్పడానికైనా ఈ పెళ్లి హడావడిలో ఇప్పుడు అవదు కదా!
స్నానం చేయాలి. తాయారమ్మ ఓరగ రూపాదేవిని చూస్తూ మంచం మీదే ఉంది.
రూప కి ఒక ఆలోచన వచ్చింది. గబ గబా తాయారమ్మ చూస్తూ ఉండగానే, పెట్టెలో ఉన్న నగలు, కేష్ మొత్తం ఒక చిన్న నల్ల బేగ్ లో ఉంచి జిప్ వేసింది.
" అత్తా, నేను స్నానం చేసి వచ్చిన దాకా ఈ బేగ్ నీ చేతిలోనే ఉంచు సుమా! చూసేవు కదా! పదివేలు కేష్, కెంపుల సెట్, చంద్రహారాలు ఇందులో ఉన్నాయి. జాగ్రత్త సుమా, లోపలకి
ఎవరినీ రానివ్వకు. నేను తలుపు వేసి మరీ స్నానానికి వెళ్ల్తున్నా!". అంటూ బేగ్ తాయారమ్మకే అప్పచెప్పేసింది.
ఎవరినీ రానివ్వకు. నేను తలుపు వేసి మరీ స్నానానికి వెళ్ల్తున్నా!". అంటూ బేగ్ తాయారమ్మకే అప్పచెప్పేసింది.
తాయారమ్మ మొహం మాడింది. రూపాదేవి నవ్వుకుంటూ వెళ్లి హాయిగా స్నానం చేసి వచ్చింది. వచ్చి బేగ్ తీసుకొని
" హమ్మయ్యా అత్తా నువ్బు ఉండబట్టి నేను ఈ పెళ్లిలో నిశ్చింతగా ఉన్నా"
అని తయారవడం మొదలెట్టింది.ఇంక ఆ పెళ్లి లో ఉన్న ఒక్క రోజూ తాయారమ్మని అంటి పెట్టుకొని తిరిగి, అవసరానికి, ఆమెకే తన బేగ్ అప్ప చెప్తూ గడిపేసింది.
అని తయారవడం మొదలెట్టింది.ఇంక ఆ పెళ్లి లో ఉన్న ఒక్క రోజూ తాయారమ్మని అంటి పెట్టుకొని తిరిగి, అవసరానికి, ఆమెకే తన బేగ్ అప్ప చెప్తూ గడిపేసింది.
తాయరమ్మ పెసర బద్దంత మొహంతో
భద్రంగా రూపా దేవి నగలు డబ్ను దాస్తూ ఆమెకే అప్పచెప్పింది.
భద్రంగా రూపా దేవి నగలు డబ్ను దాస్తూ ఆమెకే అప్పచెప్పింది.
పెళ్లి హాయిగా ఎంజాయ్ చేసి విజయగర్వం , రూపాదేవి తిరిగి తన ఊరు చేరుకుంది.