ప్రజా నాయకుడు..

పది మంది కోసం పోరాడటానికి వచ్చే పోరాట యోధుడు. వంద మంది కోసం జీవితాన్ని వదులుకున్న నాయకుడు. వేల మంది కోసం తన ఆస్తిని వదిలేసిన మహానుభావుడు. లక్షల గుండెల్లో తన మీద అభిమానాన్ని పెట్టుకున్న దేవుడు. ఇప్పుడు కొన ఊపిరి ఉండి ఇక్కడ ప్రాణాలతో కొట్టుకుంటున్నాడు.
ఆయనకి అందరు ఉన్న అనాథ లాగ ఒక్కడే ఉన్నారే మన కేశవ గారు అని రాజయ్య అక్కడ ఉన్న డాక్టర్ శివ తో చెప్తూ ఉంటుంటే. ఆయన ఎవరు ఇంత చెప్పిన ఆయన వెనకాల ఒకరు కూడ లేరు.నువ్వు ఒక్కడివే వచ్చావు అసలు ఏంటి ఇది రాజయ్య. నెల రోజులు నుండి చూస్తున్న ఆయన్ని చూడడానికి ఒక్కరు కూడ రావడం లేదు.ఆయన ఎప్పడూ ఎవరినో చూడాలి అని తపన పడుతున్నారు.ఆ వ్యక్తిని తీసుకురండి రాజయ్య. ఇక మా చేతుల్లో ఏమి లేదు అంత ఆ భగవంతుడు దయ మేము చేయవాల్సింది అంత చేసాము రాజయ్య అంటుంటే.
రాజయ్య డాక్టర్ శివ చేతులు పట్టుకుని అయ్యా కేశవ బాబుని చిన్నప్పటి నుండి చూస్తున్నాము.కొన్ని కోట్లకు రారాజు, అడుగు తీసి అడుగు పెడితే కావాల్సిన పనికి ఇంటి నిండా పని వాళ్ళు. చిన్నప్పుడే కేశవ తల్లి చనిపోయింది,కేశవ తల్లి చనిపోయింది అని దిగులుతో కేశవ తండ్రి కూడ తాగుడుకు బానిస అయ్యి ఆ పెద్ద బంగాలలో ఒక గదికి అంకితం అయిపోయారు. కేశవ వాళ్ళ అమ్మమ్మ గారే మొత్తం బాధ్యతలు చూసుకునే వారు.
కేశవ బాబు చిన్నప్పటి నుండే చాల చురుకైన విద్యార్థి. డబ్బు అనేది ఆ బాబుకు తెలియదు అనుకుంట పసివాడు కింద ఉన్న దగ్గర నుండి ఎటువంటి కల్మషం లేకుండ చక్కగా నవ్వుతూ ఉండేవాడు.
కేశవ బాబుకి 14 సంవత్సరాలు ఉన్నప్పుడు తన స్కూల్ టీచర్ స్వర్ణని అదే స్కూల్ యాజమాని ప్రేమ పేరు చెప్పి పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి తల్లిని చేసి వదిలేసాడు. ఈ అవమాన భారం భరించలేక నలుగురికి తెలిస్తే పరువు పోతుంది అని ఆ స్వర్ణ టీచర్ ఆ ఊరిలో ఉన్న చెరువులో దూకేసింది. అప్పుడు అదే దారిలో వెళ్తూ ఉన్న కేశవ తన స్నేహితులు ఇది చూసి వెంటనే ముగ్గురు ఆ చెరువులో ఈదుకుంటు వెళ్లి స్వర్ణని రక్షించారు.
స్వర్ణకి జరిగిన అన్యాయం తెలిసి కేశవ తన మిత్రులు రాజు మరియు సతీష్ కలిసి వాళ్ళ స్కూల్ యజమాని ప్రసాద్ ఇంటికి వెళ్లారు.
కేశవ వెళ్లి ప్రసాద్ మాస్టర్ స్వర్ణ టీచర్ చాలా మంచిది,మీరు అంటే ఇష్టం మాస్టర్ అని కేశవ తన స్నేహితులు కలిసి బతిమిలాడుకుంటున్నారు. ప్రసాద్ ఇవేమీ పట్టించుకోకుండ స్వర్ణ ని నువ్వు చస్తే చావు నీకు నాకు సంబంధం లేదు అని అంటూ ఉండగా. అప్పటిదాక శాంతంగా ఉన్న కేశవ ఒక్కసారిగా ప్రసాద్ కాలర్ పట్టుకుని కొట్టుకుంటూ తీసుకుని ఊరు మధ్యలో ఉన్న పంచాయతీ దగ్గరకి తీసుకు వచ్చారు. జనాలు అందరూ గుమిగూడారు కేశవ మాట్లాడుతూ మేము తప్పులు చేస్తే మమ్మల్ని దండించాల్సిన మీరే ఈ స్థితికి తీసుకు వచ్చారు. ఈ జనాల మధ్యలో మీరు స్వర్ణ టీచర్ కి తాళి కడతార లేక మీకు అందరం కలిసి పాడి కట్టమంటారా అని బెదిరించి ఒక ఆడపిల్లకు అన్యాయం జరగకుండా కాపాడాడు ఆ వయసులోనే.
జనాల గుండెల్లో అప్పటి నుండే స్థానం సంపాదించాడు.కేశవ చదువులతో పాటు జనాల సమస్యల మీద పోరాటానికి సిద్ధంగా వాటిని పరిస్కరించడానికి ఎప్పుడు ముందు ఉండేవాడు.
తన ఊరిలో గాని పక్క ఊర్లలో గాని ఏమన్నా సమస్యలు ఉంటే అందరు కేశవ బాబు గారి బంగ్లా వైపే చూసేవారు.ఒక పక్కన చదువుకుంటు ఇంకో పక్కన ప్రజల సమస్యలు తీర్చడానికి ఎప్పుడు తీరిక లేకుండా పనిచేసేవాడు.
ఇంట్లో ఉన్న కేశవ వాళ్ళ అమ్మమ్మ కేశవని పిలిచి కేశవ మనకి ఎందుకురా ఊరిలో ఉన్న సమస్యలు, మన వ్యాపారాలు తోటలు పొలాలు చూసుకోర, మీ నాన్న చూస్తే ఒక గదిలో తాగుతూ బయటకు రాకుండా ఉంటాడు. నువ్వు ఏమో ప్రజలు అంటూ రోడ్ మీద తిరుగుతున్నావు.పోయి పోయి రాజకీయ నాయకులతో గొడవలు ఎందుకురా.ఎలాగూ ఈ సంవత్సరం డిగ్రీ అయిపోతే నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా అంటే.
కేశవ మాట్లాడుతూ అమ్మమ్మ మన తాతల కాలం నుండి మనకి ఆస్తులు చాలా ఉన్నాయి. అవసరానికి మించిన డబ్బు చాలా ఉంది మన దగ్గర తరతరాలుగా తినడానికి. ఇక్కడ ఇలా ఉంటున్నాయి కాబట్టి ప్రజల సమస్యలు తెలియడం లేదు మీకు. బయట జనాలు ఒక రోజు పస్తు ఉండి గంజి తాగుతూ తమ పిల్లలకి పట్టేడు అన్నం పెట్టలేకపోతున్నారు. సరిగ్గా వాళ్ళ పిల్లల్ని చదివించలేక పోతున్నారు. గ్రామాల నుండి పట్నాలకి పొట్ట చేత పట్టుకొని వలస వెళ్తున్నారు. వాళ్ళని అలా చూస్తూ ఇక్కడ నేను ఎలా ఉండగలను అమ్మమ్మ.
అమ్మ లేని లోటు నువ్వు తీరుస్తున్నావు అలా అని ఈ రాజభోగాలు నేను అనుభవించలేను. వారి కళ్ళలో ఆనందం కనపడే దాక నా పోరాటం తప్పదు.ఈ సారి మనం ప్రతి సంవత్సరం చేసే జాతరకి ఖర్చు పెట్టె డబ్బు పేద వాళ్ళ కడుపు నింపడానికి బియ్యం కొని పంచిపెడదాము. మనకి ఊరికే పడి ఉన్న రెండు భవంతులను ఒకటి ప్రభుత్వ కాలేజీకి రెండోది ప్రభుత్వ ఆసుపత్రికి ఇస్తున్నాము.ఇందులో ఏ మార్పు లేదు అమ్మమ్మ ఇదే నా నిర్ణయం అని చెప్పి. నేను పెళ్లి చేసుకుంటాను అందులో మార్పు లేదు కానీ నా అభిరుచులకు నా ఆశయాలకు నా వెంట ఉండే అమ్మాయిని చేసుకుంటాను అమ్మమ్మ అని వెళ్ళిపోయాడు.
ఊరి జనం వచ్చి ఈ సారి సర్పంచ్ క్రింద మీరు నిలబడాలి కేశవ బాబు అంటే, నేను కాదు మన రాజు ఈ సారి ఎన్నికలలో నిలబడతాడు అనగానే, కేశవ బాబు మాట తు.చ తప్పకుండ రాజుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ప్రజలు.
10సంవత్సరాలలో తన పంచాయతీతో పాటు పక్కన ఉన్న ప్రతి పంచాయతీ లలో ఎంతో మార్పు కేశవ అడుగు జాడల్లో ఎంతో క్రమశిక్షణతో ఉన్నారు.అక్షరాస్యత పెరిగింది, పంటల దిగుబడి పెరిగింది, ప్రతి ఇంటికి పాడి మీద సంపాదన పెరిగింది ఇవి అన్ని చూసిన ప్రజల కళ్ళల్లో ఆనందం వచ్చింది.వెంటనే కేశవ స్నేహితుడు రాజు కేశవతో నీకు 30 సంవత్సరాలు వచ్చాయి ఇక పెళ్లి చేసుకో అని బలవంతం చేస్తే.కేశవ రాజుతో మా అమ్మమ్మ నిన్నటి దాక ఇప్పటి నుండి నువ్వా రాజు అంటే.
అక్కడ ఉన్న ప్రజలు కూడ చేసుకోండి బాబు అమ్మమ్మ గారికి వయసు అయిపోతుంది అంటే ఇక మీరు అందరూ చెప్పాక చేసుకోకుండా ఉంటాన అనే లోపు, రాజయ్య వచ్చి కేశవ బాబు మీ నాన్న గారు ఉన్నట్టు ఉండి ఉలుకూపలుకు లేకుండా పడిపోయారు, వెళ్లి శ్వాస చూస్తే అందడం లేదు అయ్యా చనిపోయారు మీ నాన్న గారు అంటే అక్కడే కుప్ప కూలి పోయాడు కేశవ.
వాళ్ళ నాన్న దగ్గరకి వెళ్ళి లే నాన్న లేచి నిలబడి నాతో మాట్లాడు.చూడు నాన్న నువ్వు రాసుకున్న డైరీలో ఉన్నట్టు ఇప్పడు మన ఊర్లు అలాగే ఉన్నాయి.ఇది నీ ఆశయం నాన్న అని ఏడుస్తూ నన్ను మళ్ళీ అనాథను చూసేసావ నాన్న.నేను పడుకున్నాక నా దగ్గరకి వచ్చి నా నుదిటి మీద ముద్దు పెడతావు కద నాన్న. అమ్మ లేక నువ్వు ఇలా అయిపోయావు. నువ్వు అంటే ఎప్పుడు నాకు ఇష్టమే నాన్న అంటూ జరగాల్సిన కార్యక్రమాలు చూసి తన తండ్రి చితికి నిప్పు పెట్టి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.అదే మొదటిసారి కేశవ బాబు ఏడవడం అని ప్రజలు కూడా చాలా బావోద్వేగానికి గురి అయ్యారు.
కొన్ని రోజులు గడిచాక బాధ నుండి తెరుకున్నాక, ఊర్లో ఉన్న యువతను పరిశ్రామికరణ వైపు నడిపించాడు.కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టించి చాలా మందికి ఉపాది కూడ పెట్టించాడు. వందల మందికి నిత్య అన్నదానం చేస్తు తనకి 45 సంవత్సరాలు వచ్చిన పెళ్లి చేసుకోవాలని ఆలోచన కూడ రాలేదు,కేశవ అమ్మమ్మ గారు కూడ చనిపోయారు.
కేశవ బాబుని చాలా మంది రాజకీయ నాయకులు తమ పార్టీల్లోకి తీసుకోవాలని చూస్తూ ఉన్న దానికి ఆయన ఎప్పడూ నిరాకరించేవారు. జనాల కోసం ఉండి వాళ్ళ సుఖం కోసం పగలు రాత్రి కష్ట పడుతూ ఆనందంగా ఉంటున్న సమయాన డాక్టర్ బాబు అంటూ.
డాక్టర్ శివతో ఏమి అయింది రాజయ్య చెప్పు అంటే, రాజయ్య చెప్తున్నాడు. ఎప్పట లాగానే ఉదయం లేచిన కేశవ బాబు మొహం కడుక్కుని రాజయ్య టీ తీసుకురా అని రాజయ్య టీ తీసుకుని వెళ్లే లోపు కేశవ బాబు కింద పడిపోయి ఉన్నాడు కళ్ళు తిరిగి. నేను డ్రైవర్ వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్తే అక్కడ కొంచెం ట్రీట్మెంట్ తీసుకుని సిటీకి పోవాలి అని చెప్తే మీ దగ్గరకి తీసుకు వచ్చాము అయ్యా.
ఊరిలో అందరికి కేశవ బాబు పని మీద వేరే దేశం వెళ్లారు అని చెప్పి ఇక్కడ ఉన్నాము అయ్య, ఆయన బ్రతకడు కోమాలోకి వెళ్ళాడు అని చెప్పారు ఏదో మాయదారి క్యాన్సర్ వచ్చింది అన్నారు.చివరి దశలో ఉంది అంటే ఈ విషయం కేశవ బాబుకి తెలిసి కూడ చాలా సంతోషంగా గడిపేసారు. రెండు నెలల క్రిందట తన ఆస్తి మొత్తం ఒక ట్రస్ట్ కింద పెట్టారు.అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏమి మాట్లాడకుండ ఉన్నాడు డాక్టర్ గారు.
వెంటనే డాక్టర్ మాట్లాడుతూ కేశవ బాబుకి నేను కూడ ఋణపడి ఉన్నాను రాజయ్య, ఆ రోజు స్వర్ణ టీచర్ ని కాపాడారు అన్నారు కదా ఆ స్వర్ణ గారి అబ్బాయిని నేనే. మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది మనము ఇద్దరం ఇలా బతికి ఉన్నాము అంటే అది కేశవ బాబు అనే అని.డాక్టర్ శివ వెళ్లి కేశవ కాళ్ళని పట్టుకున్నాడు.
ఇంతలో తన స్నేహితులు రాజు మరియు సతీష్ వచ్చారు.కేశవని అలా చూడగానే ఇద్దరి కళ్ళలో నీళ్ళు వచ్చాయి.ఎందుకురా మమ్మల్ని ఇలా వదిలి వెళ్లిపోతున్నావు అని పట్టుకున్నారు. అప్పటి దాక కోమాలో ఉన్న కేశవ రాజు చేయు పట్టుకుని,కళ్ళలో నీళ్లు కారుస్తూ ఉండగా నీ ఆశయాన్ని మేము కాపాడతాము కేశవ అని అంటూ ఉండగా ఒక చిరునవ్వు నవ్వి రాజు చేయి గట్టిగా పట్టుకుని తుదిశ్వాస విడిచాడు కేశవ.ఇది విన్న జనాలు గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నారు.
తన సొంత ఊరుకి కేశవని తీసుకు వెళ్తూ ఉండగా. కొందరు వచ్చి అన్ని కోట్లు ఉన్న మా ఇంట్లోకి వచ్చి తినే వాడివి కదా కేశవ బాబు, మమ్మల్ని వదిలి వెళ్లకు అయ్య లెగు అయ్య నీ జనాల కోసం అని వాళ్లలో ఉన్న రోదనలని ఎవరు ఆపలేకపోతున్నారు. కాటికి తీసుకువెళ్ళాక కేశవని చూస్తు రాజు ఏడుస్తూ ప్రజల కోసం బతికిన నువ్వు సజీవంగా లేకపోవచ్చు, కానీ ప్రజల గుండెల్లో నువ్వు ఎప్పుడు ఉంటావు కేశవ అంటూ కేశవకి కన్నీటి వీడ్కోలు పలికారు...