ఒక అడవిలో ఒక ఒంటి, ఒక నక్క స్నేహంగా ఉండేవి. అక్కడ ఒక యేరు కూడా ఉంది. నక్కకు ఈత రాదు కాబట్టి ఒంటి వీపు పైన ఎక్కించుకుని యేరు దాటించేది. ఒక రోజు ఒంటికి చెరకు తినాలని కోరిక కలిగింది ఆ విషయం నక్కకి చెప్పింది.
అప్పుడు నక్క "యేరు దాటాక అడవి చివర ఒక చెరకు తోట ఉంది. అక్కడ చెరకు తినచ్చు అని చెప్పింది". ఒంటి నక్క అక్కడికి చేరుకున్నాయి. అక్కడున్న రెండు కోడి పిల్లలను నక్క గబుక్కున పట్టి తినేసింది. దానితో నక్క కడుపు నిండింది. ఒంటి చెరకు తినసాగింది.
కడుపు నిండినపుడు నాకు పాట పాడే అలవాటు ఉంది ఒక పాట పాడనా? అని నక్క అంది.
ఒంటి "అమ్మో! అంత పని చేయకు మిత్రమా !నా కడుపు ఇంకా నిండలేదు. పొలం కాపలా వాళ్ళు విన్నారంటే వచ్చి నన్ను కొడతారు "అని చెప్పింది.
దానికి నక్క పాట పడకుండా నన్ను నేను ఆపుకోలేను, పాడాల్సిందే అని ఊళ వేయడం మొదలుపెట్టింది. నక్క ఊళ విని పొలం కాపలా వాళ్ళు పరుగెత్తుకుని వచ్చారు. చెరకు తింటున్న ఒంటి ని దుడ్డు కర్రలతో కొట్టారు అది చూసి నక్క అక్కడి నుండి పారిపోయింది. దానితో ఒంటికి నక్క మీద కోపం వచ్చింది. నక్కకు బుద్ధి చెప్పాలనుకుంది. తిరిగి వెళ్తూ ఉండగా యేరు దాటవలసి వచ్చింది. రోజు లాగే ఒంటి నక్కను వీపు మీద ఎక్కించుకుంది. యేరు మధ్యకు చేరేసరికి ఒంటి మిత్రమా !నాకు వీపు దురదగా ఉంది, నీళ్ల లోపల ఉన్న రాయికి వీపు రుద్దుకుంటే కానీ ఉపశమనం ఉండదు అంది.
అంతే నక్క బెంబేలెత్తిపోయి అలా చేయకు మిత్రమా !నేను నీళ్లలో పడి మునిగిపోతాను నాకు ఈత రాదుగా అంది. నక్క అదెలా కుదురుతుంది? నువ్వు కడుపు నిండినపుడు పాట పాడకుండా ఉండలేవు, నేను వీపు దురదగా ఉన్నపుడు రుద్దకుండ ఉండలేను అని నీటిలో మునిగింది ఒంటి. నక్క దాని వీపు నుండి కిందకి జారీ నీళ్లలో పడిపోయింది. క్షమించమని బ్రతిమాలింది. నీళ్లలో మునిగిపోతున్న నక్కను రక్షించి ఒంటి ఒడ్డుకు చేర్చింది. నక్క తన తప్పుని తెలుసుకుని అప్పటి నుండి బుద్ధిగా ఉండసాగింది.