ఒక రైతు అన్ని రకాల పండ్ల మొక్కలతోపాటు బొప్పాయి మొక్కను కూడా నాటాడు. ఓ పండుగ రోజొచ్చింది. దేవుడికి నైవేద్యం పెట్టేందుకు పండ్ల తోటలోకెళ్లి అన్ని రకాల పండ్లూ తెంపాడు. బొప్పాయి జోలికి మాత్రం పోలేదు.
బొప్పాయికి అవమానంగా అనిపించింది. ‘దేవుడి నైవేద్యానికి నేను పనికి రానా?’ అని రైతును నిలదీసింది.
‘అన్ని పండ్ల మాదిరిగా నిన్ను వెంటనే తినలేం. కత్తితో నీ చర్మం తీయాలంటే చిరాకుగా ఉంటుంది. నైవేద్యం పెట్టిన వెంటనే తినే పండ్లనే దేవుడికి ప్రసాదంగా పెడతాం’. అని బొప్పాయి మనసు గాయపడేలా మాట్లాడాడు.
దేవుడికి నైవేద్యంగా పనికిరాని తన బతుకు వృథా అనుకుని బొప్పాయి కన్నీరు పెట్టింది. మిగతా పండ్లన్నీ బొప్పాయిని ఓదార్చాయి. ‘నీ సమస్యకు పరిష్కారం ఆ దేవుడే చూపుతాడు’ అంటూ సముదాయించాయి.
బొప్పాయి తపస్సుకు కూర్చుంది. ఏకాగ్రతతో చేసిన తపస్సు ఫలించింది. దేవుడు ప్రత్యక్షమాయ్యడు. ‘నీ తపస్సుకు కారణం ఏంటి?’ అని అడిగాడు.
‘మానవుడు నన్ను చిన్న చూపు చూడటమే నా దిగులుకు కారణం. అందుకే ఈ తపస్సు చేశాను’ చెప్పింది బొప్పాయి.
‘ఏ మానవుడు నిన్ను చిన్న చూపు చూస్తున్నాడో అతని చూపులో కలిగిన దోషాలను నివారించడానికి నువ్వే దివ్యమైన ఔషధం అవుతావు. వాళ్ల ముఖ వర్చస్సుకు నువ్వే ఉపయోగపడతావు. చివరకు నువ్వే వాళ్లకు ఆరోగ్యాన్నిచ్చే పండవుతావు’ అని దీవించి అదృశ్య మయ్యాడు దేవుడు.
అప్పటి నుంచి వైద్య పరిశోధనలు చేసిన మానవులు ధారాళమైన కంటి చూపుకు దివ్య ఔషధంగా బొప్పాయి పండును గుర్తించారు. ముఖానికి బొప్పాయి గుజ్జు రాసుకుంటే కాంతివంతం అవుతుందని కనుగొన్నారు. మధుమేహ వ్యాధి ఉన్నవారు అన్ని పండ్లూ తినలేక పోయినా ఈ పండు తినొచ్చని తెలుసుకున్నారు.
ఈ విధంగా బొప్పాయి పండు మానవుడి మెప్పు పొందింది. తనను హేళనగా చూసిన వారే ఇప్పుడు తనని దివ్య ఔషధంగా స్వీకరిస్తున్నారని సంతోషపడింది."