తపస్సులో ఉన్న జమదగ్ని మునిని దూరంగా చూసిన నక్క తనకూ గడ్డం ఉంటే బాగుండుననిపించింది. ‘ఎలా గడ్డం వస్తుందో?’ అని ఆలోచిస్తుంటే చెట్టుమీద చిలక కనిపించింది. చిలకతో మాటలు కలిపింది నక్క.
‘చిలకా! చిలకా! నాకు గడ్డం ఉంటే బాగుండుననిపిస్తోంది. కానీ గడ్డం సంపాదించడం ఎలా? నీకు తెలిస్తే చెప్పవా?’ అని అడిగింది.
‘ఎందుకు నక్కబావా! నీకు గడ్డం?’ అన్నది చిలక.
‘ఎందుకేంటి? చూశావా జమదగ్ని మునిని. అతనికున్న మహిమను. అతని మహిమంతా గడ్డం వల్లే వచ్చింది కదా! నాకూ పెద్ద గడ్డం వస్తే ఈ అడవికి రాజైపోతా. సింహానికి సేవ చేయలేక చస్తున్నాను బాబూ!’ అన్నది నక్క
ఆ మాటలకి చిలక నవ్వుకుంది. ‘ఇది ఇలా ఉంటేనే సింహానికి లేనిపోనివి చెప్పి అడవినంతా అల్లకల్లోలం చేసేస్తోంది, ఇంక రాజై కూచుంటే జంతువుల్ని బతకనిస్తుందా!’ అని మనసులో అనుకొని పైకి ఇలా అంది.
‘అయితే నక్కబావా! నేనో విషయం చెప్తాను విను. ఉత్త పుణ్యానికి నీకోరిక తీరదు గాని, నోటికి, చేతికి సాధ్యం కానిదేమైనా ఉందా? నువ్వు తపస్సుకు కూచుంటే దేవుడు ప్రత్యక్షమై నీకెంత గడ్డం కావాలని అడిగితే ఏం చేస్తావ్? అందుకని ముందే జమదగ్ని గడ్డం ఎంతుందో తెలుసుకుని తపస్సులో మునిగిపో’ అన్నది చిలక.
‘నువ్వన్నమాట నిజమే’నని నక్క వెళ్లిపోయింది.
మర్నాటి నుంచి ఆశ్రమ పరిసరాల్లో తచ్చాడుతూ ఉంది నక్క. దాని దురదృష్టమో ఏమో ఎప్పుడూ ముని తపస్సులోనే ఉండటం మూలాన జమదగ్నితో మాట్లాడటం కుదర్లేదు. ఇక ఆగలేకపోయింది. ఒకరోజు ఎలాగోలా జమదగ్ని ముని గడ్డాన్ని కొలుద్దామని అడుగులో అడుగు వేసుకుంటూ బయలుదేరింది.
నోటికి, చేతికి పని చెప్పమంది కదా చిలక అని జమదగ్నిని సమీపిస్తూనే వూళ వేసింది గట్టిగా. ఆ వూళ శబ్దానికి శిష్యులు బయటకు వచ్చి ‘పాడునక్క గురువుగార్ని కరిచేద్దామని వచ్చిందర్రా’ అని కర్రలు నక్క మీదకు విసిరారు. ఆ కర్రల్లో ఒకటి పరిగెత్తుతున్న నక్కకు తగిలి కాలుకాస్తా విరగటంతో కుయ్యో మొర్రో అనుకుంటూ కుంటుతూ పారిపోయింది నక్క.
నక్కకు తగిన శాస్తి జరిగిందనుకొని నవ్వుకుంది చిలక. మంచిగా మాట్లాడమని, మంచి పనులు చేయమంటే నక్క తన బుద్ధి వంకరే అని నిరూపించుకుంది."