"description": "ఐస్‌క్రీమ్ అంటే అందరికీ ఇష్టమే... ఆ ఇష్టం మరీ ఎక్కువైపోతే? ఐస్‌క్రీమ్ దినోత్సవం ఏర్పడుతుంది! ఐస్‌క్రీమ్ మాసోత్సవం కూడా జరుగుతుంది! కావాలంటే ఈ నెలలో అమెరికా బయల్దేరండి.\n\n * అమెరికాలో ఐస్‌క్రీమ్ పేరిట ఓ నెల పొడవునా సంబరాలు జరుగుతాయి. ఆ నెలలో ఒక రోజును ఐస్‌క్రీమ్ దినోత్సవంగా కూడా జరుపుతారు. అది ఈ నెలే. \n\n * అక్కడ చాలా ప్రాంతాల్లో జులైను ‘నేషనల్ ఐస్ క్రీం మంత్’గా జరుపుకుంటారు. ఈ నెలలో మూడో ఆదివారాన్ని ప్రత్యేకంగా ‘నేషనల్ ఐస్‌క్రీమ్ డే’గా కూడా జరుపుకుంటారు. దీన్ని ప్రారంభించింది ఎవరో తెలుసా? 1984లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న రొనాల్డ్ రీగన్. \n\n * ఆ ఏడాది కెంటకీ రాష్ట్ర సెనేటర్ వాల్టర్ డీ హెడల్టన్ అధికారికంగా ఐస్‌క్రీమ్ సంబరాలు నిర్వహించారు. అప్పటి నుంచి అందరికీ అలవాటుగా మారింది. \n\n * ఈ నెలలో అమెరికాలో చాలా చోట్ల ఐస్‌క్రీమ్ పార్టీలు ఏర్పాటు చేసుకుంటారు. \n\n * మామూలుగానే అమెరికన్లకు ఐస్‌క్రీమ్ అంటే ఎంతో ఇష్టం. అక్కడ 80 శాతం మంది ఇళ్లలోని ఫ్రిజ్‌ల్లో ఐస్‌క్రీమ్ తప్పకుండా ఉంటుందట. \n\n * అమెరికాలో ఉత్పత్తి అయ్యే పాల ఉత్పత్తుల్లో 10 శాతానికి పైగా వీటి తయారీకే వాడతారు. \n\n * వెనీలా, చాక్లెట్ ఫ్లేవర్లను ఎక్కువగా ఇష్టపడతారు. అక్కడ ఒక్కో వ్యక్తీ ఏడాదికి సగటున 18.4 లీటర్ల ఐస్‌క్రీమ్ తింటాడట. \n\n * 2015 ఏడాది మొత్తంలో అక్కడ 5.8 బిలియన్ లీటర్ల ఐస్‌క్రీమ్ అమ్ముడైపోయింది. దాని మార్కెట్ దాదాపు రూ.73వేల కోట్లకు పై మాటే!\n\n మీకు తెలుసా?\n\n * ఇప్పుడు వెయ్యికిపైగా ఐస్‌క్రీమ్ ఫ్లేవర్లు ఉన్నాయి. \n\n * ఐస్‌క్రీమ్ ప్రియుల్లో ఎక్కువ మంది చాక్లెట్ సిరప్ ఫ్లేవర్‌నే ఇష్టపడుతున్నారు. \n\n * ప్రపంచవ్యాప్తంగా తినే వెనీలా ఐస్‌క్రీమ్‌లో ఎక్కువ భాగం మడగాస్కర్, ఇండోనేషియాల నుంచే తయారై వస్తుంది.\n\n ప్రపంచంలో ఎక్కువగా ఐస్‌క్రీమ్ తినే దేశాలు \n\n 1. న్యూజిలాండ్ 2. అమెరికా 3. ఆస్ట్రేలియా 4. ఫిన్లాండ్ 5. స్వీడన్ \n\n ఐస్‌క్రీమ్ చరిత్ర \n\n * క్రీ॥పూ. 5వ శతాబ్దంలోనే గ్రీకు ప్రజలు ఐస్‌క్రీమ్‌ని పోలిన పదార్థాన్ని తిన్నట్లు ఆధారాలున్నాయి. \n\n * 17వ శతాబ్దంలో ఫ్రాన్స్‌లో తయారు చేశారు. \n\n * 1700ల్లోనే ఇది అమెరికా ప్రజలకూ పరిచయమైంది. \n\n * 1776లో న్యూయార్క్‌లో తొలి ఐస్‌క్రీమ్ పార్లర్ ప్రారంభమైంది. \n\n * 1904లో తొలిసారి కోన్ ఐస్‌క్రీమ్ తయారైంది."
Subscribe to:
Post Comments (Atom)
